మ‌ళ్లీ తెరుచుకోనున్న‌ నుమాయిష్.. ఎప్పుడంటే..

Hyderabad's Numaish likely to reopen in February-end. కొవిడ్‌-19 కేసుల పెరుగుదల కారణంగా హైదరాబాద్‌లో మూసివేయబడిన ప్రముఖ వార్షిక

By Medi Samrat  Published on  11 Feb 2022 9:27 AM GMT
మ‌ళ్లీ తెరుచుకోనున్న‌ నుమాయిష్.. ఎప్పుడంటే..

కొవిడ్‌-19 కేసుల పెరుగుదల కారణంగా హైదరాబాద్‌లో మూసివేయబడిన ప్రముఖ వార్షిక వాణిజ్య స‌ముదాయం నుమాయిష్ ఈ నెలాఖరులో తిరిగి తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నుమాయిష్ ఈ ఏడాది జనవరి 1న తెరవబడింది. అయితే పాజిటివిటీ రేటు ఎక్కువ‌గా ఉన్న‌ కారణంగా ఒక రోజులో మూసివేయబడింది. మహమ్మారి థ‌ర్డ్‌వేవ్‌ ముగిసింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించినందున ఎగ్జిబిషన్ సొసైటీ, నిర్వాహకులు ఫిబ్రవరి 20, 25వ తేదీ మధ్య నుమాయిష్‌ను తిరిగి తెరవాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఆంక్షలు ఎత్తివేయబడినందున నుమాయిష్‌ను తిరిగి తెరవడానికి అనుమతించాలని నిర్వాహకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

బుధవారం ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతిపాదనపై చర్చించడానికి కొంతమంది ప్రభుత్వ అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. సొసైటీ ప్రకారం.. వివిధ శాఖలు సానుకూలంగా స్పందించాయి. తుది ఆమోదం కోసం వేచి ఉన్నాయి. సంబంధిత అన్ని శాఖల నుండి అనుమతి పొందిన తర్వాత, సొసైటీ వ్యాపారులను మళ్లీ తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానిస్తుంది. 45 రోజుల పాటు సాగే నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైంది. అయితే మహమ్మారి కారణంగా జనవరి 10 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో మరుసటి రోజే మూసివేయబడింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు బహిరంగ సభలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల దృష్ట్యా రద్దు చేశారు.

జనవరి 2వ తేదీన‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించిన ఒక రోజు తర్వాత.. నుమాయిష్‌ను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎగ్జిబిషన్‌ను మూసివేయాల్సిందిగా ఎగ్జిబిషన్ సొసైటీని అధికారులు ఆదేశించడంతో మొదటి రోజే దాదాపు 10,000 మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితి కారణంగా గతేడాది నుమాయిష్ నిర్వహించలేదు. 1938లో ప్రారంభమైనప్పటి నుండి నుమాయిష్‌ను నిర్వహించలేకపోవడం చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే.


Next Story