వ‌ర‌ల్డ్‌ టాప్-100 వంటకాల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ స‌హ మరో మూడు భారతీయ వంటకాలు

ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ, మరో మూడు భారతీయ వంటకాలు చోటు దక్కించుకున్నాయి.

By Medi Samrat  Published on  12 Dec 2024 3:09 PM IST
వ‌ర‌ల్డ్‌ టాప్-100 వంటకాల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ స‌హ మరో మూడు భారతీయ వంటకాలు

ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ, మరో మూడు భారతీయ వంటకాలు చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ గ్లోబల్ ట్రావెల్ అండ్ ఫుడ్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. ఖచ్చితమైన ర్యాంకింగ్‌లకు టేస్ట్ అట్లాస్ ప్రసిద్ధి చెందింది. టేస్ట్ అట్లాస్.. హైదరాబాదీ బిర్యానీని 31వ స్థానంలో ఉంచింది. బటర్ చికెన్‌గా ప్రసిద్ధి చెందిన ముర్గ్ మఖానీ 29వ స్థానంలో ఉంది. మరో రెండు భారతీయ వంటకాలు, చికెన్ 65, కీమా కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చేరాయి.

టేస్ట్ అట్లాస్ వ‌ర‌ల్డ్‌ టాప్ 100లో చోటు ద‌క్కించుకున్న‌ భారతీయ వంటకాలు..

1. ముర్గ్ మఖానీ (29వ ర్యాంక్)

2.హైదరాబాదీ బిర్యానీ (31వ ర్యాంక్)

3.చికెన్ 65 (ర్యాంక్ 97)

4.కీమా (100వ ర్యాంక్)

ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ రెండిటికీ 4.52 రేటింగ్ ఇవ్వ‌గా.. చికెన్ 65, కీమా 4.44 స్టార్ రేటింగ్‌ అందుకున్నాయి.

బిర్యానీ.. నిజాం కిచెన్ నుంచి త‌యారైన వంట‌కం. అంద‌రికీ ఇష్టమైన పుడ్‌. బిర్యానీని బాస్మతి బియ్యం, లేత మాంసంతో తయారుచేస్తారు. ఇది హైదరాబాదీ, మొఘలాయ్ వంటకాల సామరస్య సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ వంటకం హైదరాబాద్ నగర అత్యంత ప్రియమైన, రుచికరమైన వంట‌కంగా పేరొందింది. హైదరాబాదీ బిర్యానీ ఉన్నతస్థాయి రెస్టారెంట్లలో లేదా స్ట్రీట్ సైడ్ షాపుల‌లో అందుబాటులో ఉన్నా ఇక్క‌డి బిర్యానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ముర్గ్ మఖానీ, చికెన్ 65, కీమా వంటి భారతీయ వంటకాలు కూడా ఆహ‌ర ప్రియుల‌ను ఆకర్షించే భారతదేశపు విభిన్న రుచులకు ఉదాహరణలు.

Next Story