హైదరాబాద్ జూ పార్క్‌లో నైట్ సఫారీ కూడా..!

జూలలో నైట్ సఫారీలపై నిషేధాన్ని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (CZAI) ఎత్తివేసింది.

By Medi Samrat
Published on : 7 July 2025 6:46 PM IST

హైదరాబాద్ జూ పార్క్‌లో నైట్ సఫారీ కూడా..!

జూలలో నైట్ సఫారీలపై నిషేధాన్ని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (CZAI) ఎత్తివేసింది. దీంతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నైట్ సఫారీని ప్రారంభించనుంది. అయితే నైట్ సఫారీ ప్రణాళిక ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఈ సఫారీని ఒక సంవత్సరం లోపు ప్రారంభిస్తామని, ఇందులో రాత్రిపూట అనేక జంతువులు ఉంటాయన్నారు. సాయంత్రం 6:00 నుండి రాత్రి 11:00 గంటల మధ్య నైట్ సఫారీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మొత్తం 2,240 జంతువులకు నిలయంగా ఉంది, వీటిలో 55 జాతులకు చెందిన 664 క్షీరదాలు, 97 జాతులకు చెందిన 1,227 పక్షులు, 38 జాతులకు చెందిన 341 సరీసృపాలు ఉన్నాయి.

Next Story