వన్‌టైమ్ డిస్కౌంట్.. 15 రోజుల్లో 1.3 కోట్ల చలాన్ల క్లియర్

Hyderabad Traffic police targets 300 crores as part of a one time discount on E Challans.'వన్‌టైమ్' డిస్కౌంట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2022 4:20 AM GMT
వన్‌టైమ్ డిస్కౌంట్.. 15 రోజుల్లో 1.3 కోట్ల చలాన్ల క్లియర్

'వన్‌టైమ్' డిస్కౌంట్ కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు నాటికి పెండింగ్‌లో ఉన్న చలాన్ల నుండి రూ. 300 కోట్లు వసూలు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.

పెండింగ్‌ చలాన్ల క్లియరెన్స్‌కు పోలీసు శాఖ ఇచ్చిన రాయితీని వాహనదారులు సద్వినియోగం చేసుకొంటున్నారు. కేవ‌లం 15 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1.3కోట్ల పెండింగ్ చ‌లాన్లు క్లియ‌ర్ కాగా.. వాటి నుంచి రూ.130కోట్ల జ‌రిమానా వ‌సూలైన‌ట్లు జాయింట్ కమీషనర్ ఆఫ్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ న్యూస్‌మీటర్‌తో చెప్పారు. మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో 80 శాతం కంటే ఎక్కువ చ‌లాన్లు క్లియ‌ర్ అయ్యాయ‌ని అన్నారు. హైదరాబాద్ వెలుపల నుంచి చలాన్లు క్లియర్ చేసిన వారి శాతం తక్కువగా ఉందన్నారు. వాహ‌న‌దారులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని.. రాయితీతో పెండింగ్ చ‌లాన్ల‌ను క్లియ‌ర్ చేయాల‌ని కోరారు. ఇక నుంచి డ్రైవ్‌లను ముమ్మరం చేస్తామ‌ని, వాహనాల నంబర్లను స్కాన్ చేసి, ఎక్కువ చలాన్‌లు ఉంటే వాటిని నిలిపివేసి బకాయిలు చెల్లించేలా చూస్తామని ఆయన చెప్పారు.

ఏప్రిల్‌ నుంచి వాహనాలపై పెండింగ్‌ చలాన్లు తనిఖీ చేసి, చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌, మీసేవ, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం వద్ద చ‌లాన్లను క‌ట్ట‌వ‌చ్చు. ఈ-చలాన్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ https:// echallan.tspolice.gov.in లింక్‌ ద్వారా కూడా రాయితీతో జరిమానా చెల్లించొచ్చు.

పెండింగ్‌ చలాన్లపై మాఫీ ఇలా

ద్వి, త్రి చక్ర వాహనాలకు – 75 శాతం మాఫీ

తోపుడు బండ్లకు – 75 శాతం మాఫీ

ఆర్టీసీ డ్రైవర్లకు – 70 శాతం మాఫీ

లైట్‌, హెవీ మోటర్‌ వాహనాలకు – 50 శాతం మాఫీ

నో మాస్క్‌ కేసుల్లో – 90 శాతం మాఫీ

Next Story