నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నామని నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం నుండి రాంగ్ రూట్, ట్రిపుల్ రైడ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని.. ఈ వారం పాటు వాహన దారులను ఎడ్యుకేట్ చేస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ డ్రైవ్ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి తీసుకు రాబోతున్న నిబంధనలు కొత్తవి కాదని.. 2013 మోటార్ వెహికల్ యాక్ట్ జీవో లో ఉన్నవేనని తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించాం. గతంలో కన్నా ప్రస్తుతం ఫైన్స్ తగ్గించాం.. వాహన రకాన్ని బట్టి ఫైన్స్ విధిస్తామని తెలిపారు.
ఐకపై రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే 1700, ట్రిపుల్ రైడింగ్ కు 1200 జరిమాన విధిస్తామన్నారు. ఎక్కువగా రాంగ్ రూట్లో వాహనాలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో.. అక్కడ ఎన్ఫోర్మెంట్ ను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసమే ఫైన్ లు విధిస్తున్నారు ఆన్న మాటలో వాస్తవం లేదన్నారు. వాహనదారుల్లో మార్పు కోసమే ఈ నిబంధనలు అని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో యూ టర్న్‌లు కిలోమీటర్ల దూరంలో పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నది అవాస్తవం అన్నారు. టైమ్ బాండ్ తో నడుస్తున్న సిగ్నల్ వ్యవస్ధ మాన్యువల్ బాగానే ఉందని.. నగరంలో విధిస్తున్న ట్రాఫిక్ ఆంక్షలు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు.