నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్‌లో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి
By అంజి Published on 23 April 2023 9:15 AM ISTనేడు హైదరాబాద్‌కు అమిత్‌షా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్‌లో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు:
- హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ వంతెన వద్ద నార్సింగి-శంకరపల్లి-పర్వేద ఎక్స్‌రోడ్డు-ఆలూరు-వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
- హైదరాబాద్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రోటరీ-1 టీఎస్‌పీఏ వద్ద సర్వీస్ రోడ్డు - నార్సింగి - జన్వాడ - శంకర్‌పల్లి - పర్వేద ఎక్స్‌రోడ్డు - వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
- శంషాబాద్, రాజేంద్రనగర్ నుండి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నెం: 18లో వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎగ్జిట్ నెం: 1 సర్వీస్ రోడ్ - మూవీ టవర్ కొత్త రోడ్ -CBIT T జంక్షన్ - శంకర్‌పల్లి - పర్వేద ఎక్స్ రోడ్ - ఆలూర్ - వికారాబాద్‌గా మళ్లించబడుతుంది.
- శంషాబాద్, రాజేంద్రనగర్ నుండి ORR ఎగ్జిట్ నెం: 18 మీదుగా చేవెళ్ల వైపు వచ్చే భారీ వాహనాలు ఎగ్జిట్ నెం: 1 సర్వీస్ రోడ్ - మూవీ టవర్ కొత్త రోడ్డు - సిబిఐటి టి జంక్షన్ - శంకర్‌పల్లి - యెంకీపల్లి ఎక్స్ రోడ్ - చేవెళ్ల మీదుగా మళ్లిస్తారు.
రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు:
- టీఎస్‌పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్ రోడ్డు- ప్రగతి రిసార్ట్స్- యెంకేపల్లి ఎక్స్ రోడ్డు- ఆలూర్ ఎక్స్ రోడ్డు- వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
- టీఎస్‌పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్ రోడ్డు- ప్రగతి రిసార్ట్స్- యెంకేపల్లి ఎక్స్ రోడ్డు- చేవెళ్ల వైపు మళ్లిస్తారు.
- టీఎస్‌పీఏ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్‌రోడ్-ప్రగతి రిసార్ట్స్-యెంకేపల్లి ఎక్స్ రోడ్-శంకరపల్లి వైపు మళ్లిస్తారు.
చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు:
- వికారాబాద్ నుంచి మొయినాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఆలూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆలూర్ - పర్వేద ఎక్స్ రోడ్డు - శంకర్‌పల్లి - నార్సింగి - హైదరాబాద్ వైపు మళ్లిస్తారు.
- వికారాబాద్ నుంచి షాబాద్, షాద్‌నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ బస్తీపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పమెన - పమెన ఎక్స్ రోడ్డు - నాగర్‌గూడ ఎక్స్ రోడ్డు - షాబాద్ వైపు మళ్లిస్తారు.
- షాబాద్ నుండి వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పమెన ఎక్స్ రోడ్ వద్ద పమెన - బస్తేపూర్ - NH 163 - వికారాబాద్ వైపు మళ్లిస్తారు.
- మొయినాబాద్ నుండి వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ షాబాద్ ఎక్స్ రోడ్ - పమెన ఎక్స్ రోడ్ వద్ద పమెన - బస్తేపూర్ - ఎన్ హెచ్ 163 - వికారాబాద్ వైపు మళ్లించబడుతుంది.