కేరళలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న హైదరాబాదీలకు ఏమైందంటే.?

హైదరాబాద్‌కు చెందిన నలుగురు సభ్యులతో కూడిన బృందం గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఊహించని ప్రమాదంలో పడింది.

By M.S.R  Published on  25 May 2024 12:15 PM IST
కేరళలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న హైదరాబాదీలకు ఏమైందంటే.?

హైదరాబాద్‌కు చెందిన నలుగురు సభ్యులతో కూడిన బృందం గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఊహించని ప్రమాదంలో పడింది. కేరళలో శుక్రవారం రాత్రి కూరప్పంతర వద్ద కాలువలో కారు పడిపోయింది. అయితే వారంతా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో చూపిన సూచనలను అనుసరించడం ద్వారా అలప్పుజకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పర్యాటకులు తెలిపారు.

గూగుల్ మ్యాప్స్ యాప్‌ను నమ్మి డ్రైవర్ ఎడమవైపు టర్న్ తీసుకున్నప్పుడు లగ్జరీ ఎస్‌యూవీ (ఫోర్డ్ ఎండీవర్) కాలువలోకి పడిపోయిందని మనోరమ న్యూస్ నివేదించింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణీకులలో ఒకరు వాహనం నుండి తప్పించుకోగలిగారు. అతను స్థానిక నివాసితులను అప్రమత్తం చేశాడు, SUV లోపల చిక్కుకున్న ఇద్దరు పురుషులు, ఒక మహిళను రక్షించడానికి సహాయం కోరాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. రహదారిపై నీరు నిలిచిందని భావించానని.. కానీ కాలువ అని గుర్తించలేకపోయానని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తెలిపాడు. భారీ వర్షం కారణంగా 10 కి.మీ వేగంతో మాత్రమే తాను డ్రైవింగ్ చేశానని తెలిపాడు.

Next Story