Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చేసింది అతడే!!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు.

By అంజి
Published on : 30 Jan 2025 8:14 AM

Hyderabad, Bomb Threat, Shamshabad Airport

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చేసింది అతడే!! 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు.

కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి జిల్లాకు చెందినవాడని ఆర్జీఐఏ సబ్ ఇన్‌స్పెక్టర్ డి అప్పారావు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి పోలీస్ స్టేషన్‌కు కాల్ చేశాడు. కాల్ డేటా రికార్డ్ (సిడిఆర్) వివరాల సహాయంతో, పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి, ప్రశ్నించగా అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని కనుగొన్నారు. బెదిరింపు కాల్ అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్‌ ను దింపారు. ఎయిర్ పోర్ట్ ఆవరణను క్షుణ్ణంగా వెతికారు. గంటల తరబడి క్షుణ్ణంగా తనిఖీ చేశాక ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఇది బూటకపు కాల్ అని ధృవీకరించారు.

Next Story