Hyderabad: లారీ డ్రైవర్‌పై దుర్భాష.. ట్రాఫిక్‌ పోలీస్‌పై బదిలీ వేటు

హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్‌ పోలీస్‌పై తెలంగాణ పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

By అంజి  Published on  18 July 2024 1:09 PM IST
Hyderabad, traffic police, lorry driver, Jeedimetla, KTR

Hyderabad: లారీ డ్రైవర్‌పై దుర్భాష.. ట్రాఫిక్‌ పోలీస్‌పై బదిలీ వేటు

హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్‌ పోలీస్‌పై తెలంగాణ పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు స్పందించారు. ఈ ఘటన సైబరాబాద్‌ జీడిమెట్ల ట్రాఫిక్‌ లిమిట్స్‌లో జరిగిందని, బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామన్నారు. అతన్ని ఆ స్టేషన్‌ నుంచి బదిలీ చేశామని తెలిపారు. తాము 24/7 గంటలూ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నగర శివారు గండిమైసమ్మ దగ్గర లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్‌ పోలీసు వీడియో వైరల్‌ అవ్వడంపై బీఆర్‌ఎస్‌ స్పందించింది. చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్‌లో సెటైర్లు వేసింది. తప్పు చేస్తే జరిమానా విధించడమో లేదా కేసు నమోదు చేయాలి గానీ దూషించడం ఏంటని ప్రశ్నించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తీసేసి బూతుల పోలీసింగ్‌ తెచ్చుడేనా మీ మార్పు అని బీఆర్‌ఎస్‌ మండిపడింది.

పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. పోలీసులు వాహనదారుడిపైన దుర్భాషలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడం అభ్యంతరకరమని కేటీఆర్ ఆగ్రహించారు. ఇది పోలీస్ శాఖకు, డిజిపికి అంగీకారయోగ్యమైన భాషే నా? అంటూ ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.

ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చింది. పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహించారు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని కేటీఆర్ తన ఎక్స్ ద్వారా డిజిపికి సూచనలు చేశారు.

Next Story