Hyderabad: హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు

సెప్టెంబర్ 8న (ఆదివారం) హైడ్రా నిర్వహించిన కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on  10 Sep 2024 7:11 AM GMT
Hyderabad, demolition, HYDRAA, Madhapur police

Hyderabad: హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు

హైదరాబాద్‌: సెప్టెంబర్ 8న (ఆదివారం) హైడ్రా నిర్వహించిన కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ నార్త్ ట్యాంక్స్‌ డివిజన్ బుద్ధభవన్‌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడంతో కేసుకు ఆధారం లభించింది. సున్నం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) జోన్‌లో అనధికార భవనాల కూల్చివేతను పర్యవేక్షించే హైడ్రా టీమ్ ఆదేశాలకు అనుగుణంగా తన అధికారిక పనులను నిర్వహిస్తుండగా స్థానికులు తనను అడ్డుకున్నారని లక్ష్మీనారాయణ (44) పేర్కొన్నారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను స్థానికులను నిలదీశారు. ఈ క్రమంలోనే వెంకటేష్ (35), అతని భార్య లక్ష్మి (28), అతని సోదరుడు నరేష్ (28) అనే ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తూ కూల్చివేతలను ఆపడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై లక్ష్మీనారాయణ పోలీసు రిపోర్టు దాఖలు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన అధికారిక విధులను నిర్వహించకుండా నిరోధించినందుకు నిందితులని చట్టపరంగా బాధ్యులను చేయాలని అభ్యర్థించారు.

Next Story