హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్‌కు పిల్లలను తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 60 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. బస్తు బోల్తా పడటంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బస్సు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. అటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.