Hyderabad: రూ.3 కోట్ల గంజాయి స్వాధీనం.. ఐదుగురు డ్రగ్స్ వ్యాపారులు అరెస్ట్
ఒడిశా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారుల ముఠా గుట్టు రట్టు చేసి దాదాపు రూ.3 కోట్ల విలువైన 803 కిలోల ఎండు గంజాయితో పాటు ఇతర అక్రమాస్తులను శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 4 Aug 2024 9:00 AM GMTHyderabad: రూ.3 కోట్ల గంజాయి స్వాధీనం.. ఐదుగురు డ్రగ్స్ వ్యాపారులు అరెస్ట్
హైదరాబాద్: ఒడిశా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారుల ముఠా గుట్టు రట్టు చేసి దాదాపు రూ.3 కోట్ల విలువైన 803 కిలోల ఎండు గంజాయితో పాటు ఇతర అక్రమాస్తులను శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ పోలీసులు, టీజీఏఎన్‌బీ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో)తో పాటు సైబరాబాద్ SOT బాలానగర్ బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
కేసు వివరాలు
శనివారం నిర్దిష్ట సమాచారంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) బాలానగర్ బృందం శంషాబాద్ పోలీసులతో కలిసి ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల వ్యాపారులను పట్టుకున్నారు.
నిందితులను సోమనాథ ఖరా (34), హరాడే సంజీవ్ విట్టల్ రెడ్డి (35), జగ సున, సంజీవ్ కుమార్ హోల్లప్ప ఒకరే (48), సునీల్ ఖోస్లా (28)లుగా గుర్తించారు. ప్రధాన సరఫరాదారుల్లో ఒకరైన ఏపీలోని అరకు వాసి రాములు పరారీలో ఉన్నారు.
మరో నిందితుడు ముంబయికి చెందిన సురేష్ మారుతీ పాటిల్, అతను రిసీవర్, ప్రధాన పెడ్లర్.
803 కిలోల గంజాయితో పాటు, కెమికల్ డ్రమ్ములు ఉన్న డీసీఎం కంటైనర్, ఒక ఫోర్ వీలర్, ఏడు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ రూ.2,94,75,000 (కిలో రూ. 35,000). ఒక్క గంజాయి విలువ రూ.2,81,05,000.
పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..
నిందితుడు సోమనాథ ఖరా ఒడిశా నివాసి. అతను రాము (ప్రధాన సరఫరాదారు) కింద పని చేస్తున్నాడు. సోమనాథ ఖరా డ్రైవర్లను ఎంగేజ్ చేయడం ద్వారా నిషిద్ధ గంజాయిని కొనుగోలుదారులకు పంపిణీ చేసేవాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సంజీవ్‌కుమార్‌కు సంజీవ్ విట్టల్‌రెడ్డిని పరిచయం చేశాడు.
వీరు DCM కంటైనర్ డ్రైవర్లు, సంజీవ రెడ్డికి DCM కంటైనర్ ఉంది. వారు వివిధ వస్తువులను రాష్ట్రాలకు రవాణా చేసేవారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు కమీషన్ ప్రాతిపదికన తమ డీసీఎం కంటైనర్‌లో ఎండు గంజాయి రవాణా చేసేందుకు సోమనాథ ఖరా హరాడే సంజీవ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అతను వైజాగ్, దాని సమీప ప్రాంతాలకు వస్తువులను డెలివరీ చేయడానికి వచ్చినప్పుడల్లా తనకు తెలియజేయమని సోమనాథ ఖరా సంజీవ్‌కు సూచించాడు.
జులై 30న పటాన్‌చెరు నుంచి వైజాగ్‌కు ఆహార పదార్థాలను రవాణా చేసేందుకు ఆర్డర్ వచ్చి, సంజీవ్‌కుమార్ హోలప్పతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్లి డి-మార్ట్, గాజువాక, వైజాగ్‌లో ఆహార పదార్థాలను డెలివరీ చేశాడు. ఈలోగా, అతను గంజాయిని రవాణా చేసి, తన DCM కంటైనర్‌లో పటాన్‌చెరులోని సురేష్ పాటిల్ (రిసీవర్)కి అందించాలని సంజీవ్‌ను ఆదేశించాడు. అనంతరం మరో వాహనంలో సురేశ్ పాటిల్ మహారాష్ట్రకు గంజాయిని తరలించేవాడు.
ఆగస్ట్ 1న సంజీవ వైజాగ్‌లోని అలవీర యానిమల్ హెల్త్ లిమిటెడ్ JNPC SEZ పర్వాడ నుండి రసాయన ద్రావకాలను లోడ్ చేశాడు. అదే రోజు సోమనాథ ఖరా తన స్నేహితులు జగ సున, సునీల్ ఖోస్లాతో కలిసి కారును అద్దెకు తీసుకుని విజయనగరం గొట్లాం ప్రాంతానికి వచ్చి 26 ఎండు గంజాయి గన్నీ బ్యాగులను డీసీఎం కంటైనర్‌లో ఎక్కించిన సంజీవరెడ్డికి అందించాడు. ద్రావకం డ్రమ్ముల కింద గంజాయిని ఉంచాడు. అక్కడి నుండి సోమనాథ ఖరా, అతని స్నేహితులు సురక్షితమైన ప్రయాణం కోసం తమ కారులో DCM కంటైనర్‌ను పైలట్ చేశారు.
సిసి కెమెరాలు లేకుండా టోల్ గేట్‌ల వద్దకు వెళ్లే ముందు డ్రైవర్లు వాహనాల నంబర్ ప్లేట్‌లను తొలగిస్తారు. వాహనాల ఫాస్ట్ ట్యాగ్‌ల సహాయంతో వారు టోల్ గేట్లను దాటేవారు. ప్రతి టోల్ గేట్ దాటిన తర్వాత వాహనాలకు నంబర్లు ఫిక్స్ చేస్తారు.
పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ జంక్షన్ సమీపంలో సైబరాబాద్, బాలానగర్ బృందం, శంషాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.