హైదరాబాద్: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జన్వాడలోని ఓ ఫంక్షన్‌కు హాజరైన వైద్యులు జస్మిత్, భూమిక కారులో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలోనే ఓవర్ స్పీడ్‌తో ఖానాపూర్ వద్ద అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జస్మిత్ అనే వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వైద్యులు భూమికకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే గాయపడిన భూమికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఇద్దరు డాక్టర్లు కామినేని ఆసుపత్రి లో హౌస్ సర్జన్స్ గా పని చేస్తున్నారు. భూమిక ఎల్బీ నగర్, జస్మిత్ బాచుపల్లి కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.