హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో చలి.. శంషాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

Hyderabad Records Lowest Temparature. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చలి

By అంజి  Published on  9 Jan 2023 6:42 AM GMT
హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో చలి.. శంషాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 9 సోమవారం నాడు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వెదర్‌మ్యాన్ చేసిన ట్వీట్ ప్రకారం.. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యల్ప ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మొత్తం తెలంగాణలో సంగారెడ్డిలోని కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 4.6°C నమోదైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.

మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రానున్న 48 గంటల్లో ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది.






Next Story