చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని ఒక యువకుడు "మాటలతో వేధిస్తున్నట్లు" చూపించే పాత వీడియో వైరల్ కావడంతో, పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. ఈ వీడియో దాదాపు మూడు సంవత్సరాల పాతదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నట్లు నగర పోలీసులు కూడా తెలిపారు.
వైరల్ వీడియోలో ఒక గుంపులోని సభ్యుడు నడుచుకుంటూ వెళ్తున్న మహిళను తిట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత పర్యాటకురాలితో ఉన్న ఒక వ్యక్తి ఆ గుంపు వద్దకు వచ్చి "సార్, మీరు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రజలకు మీ మాటలు అర్థం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి" అని హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఒక పోలీసు అధికారి ఇది మూడేళ్ల క్రితం నాటి క్లిప్, ఇది ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. "మేము ఐటీ సెల్‌తో కలిసి వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసిన తర్వాత తగిన చర్య తీసుకుంటాము" అని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి నిర్దిష్ట ఫిర్యాదు నమోదు కాలేదు. ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ చర్యలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను అభ్యర్థించారు. హైదరాబాద్ నగర పోలీసులు, Xలో పోస్ట్ చేస్తూ, "ఈ విషయాన్ని చార్మినార్ SHO దృష్టికి తీసుకుని వచ్చారు. తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు" అని అన్నారు.