పూల్స్ దగ్గర పిల్లల విషయంలో జాగ్రత్త, అందరూ 'పంచ్'లా లక్కీ కాదు: హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్ సిటీ పోలీస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది.
By - Knakam Karthik |
పూల్స్ దగ్గర పిల్లల విషయంలో జాగ్రత్త, అందరూ 'పంచ్'లా లక్కీ కాదు: హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్ సిటీ పోలీస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరిస్తూ ఒక సందేశాన్ని పంచుకుంది. ఇటీవల 'పంచ్' (Punch) అనే ఒక కోతి పిల్ల స్విమ్మింగ్ పూల్‌లో పడి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఉదాహరణగా తీసుకుంటూ, హైదరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పంచ్ సురక్షితంగా బయటపడింది, కానీ ప్రతి బిడ్డ పంచ్‌లాగా అదృష్టవంతులు కాకపోవచ్చు" అంటూ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు. స్విమ్మింగ్ పూల్స్ లేదా నీటి కుంటల వద్ద పిల్లలను ఒంటరిగా వదలకూడదని, అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పిల్లలు నీటి దగ్గర ఉన్నప్పుడు సెకను కూడా వారిపై నుంచి దృష్టి మళ్లించకూడదని సూచించారు. జపాన్ జూకు చెందిన 'పంచ్' అనే కోతి పిల్లకు సంబంధించిన ఎమోషనల్ వీడియోను, సామాజిక బాధ్యతతో ముడిపెట్టి అవేర్నెస్ కల్పించడంపై ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు.
Punch made it out safely - but not every child may be as lucky as Punch. Please take extra care of your children around swimming pools and never leave them unattended.#PoolsCanBeDangerous#HangInTherePunch pic.twitter.com/NxGGdFl5v0
— Hyderabad City Police (@hydcitypolice) February 24, 2026