Hyderabad: షాపుల మూసివేత సమయంపై పోలీసుల క్లారిటీ

షాపుల మూసివేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు.

By అంజి  Published on  25 Jun 2024 7:11 AM GMT
Hyderabad police, shops closing time, shops, Hyderabad

Hyderabad: షాపుల మూసివేత సమయంపై పోలీసుల క్లారిటీ 

హైదరాబాద్: సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకు దుకాణాలను మూసివేయమని చెబుతున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. “సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకు దుకాణాలను మూసివేయమని చెబుతున్నారని వస్తున్న ఇటీవలి సోషల్ మీడియా వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు, సంస్థలు ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం మాత్రమే తెరవబడతాయి/మూసివేయబడతాయి. అందుకే అందరూ దీనిని గమనించవచ్చు” అని హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

అంతకుముందు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద మెట్రోలు రాత్రిపూట దుకాణాలను తెరవడానికి అనుమతిస్తున్నాయని అన్నారు. ఇలాంటి ప్రకటనలే జుబ్లీహిల్స్‌లో చేయగలరా? అని పోలీసులను నిలదీశారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతిందన్నారు. అలాంటప్పుడు రాత్రి వ్యాపారాలకు అనుమతిస్తే తప్పేమిటన్నారు. అందరికీ ఒకే రూల్ ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.

Next Story