Hyderabad: వేసవి తాపం.. నెహ్రూ జూ పార్క్‌లో ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ తన జంతువులు ఆరోగ్యం, వేసవి తీవ్రతను

By అంజి  Published on  3 April 2023 12:25 PM IST
Hyderabad ,Nehru Zoological park, Hyderabad zoo, Summer

Hyderabad: వేసవి తాపం.. నెహ్రూ జూ పార్క్‌లో ప్రత్యేక చర్యలు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ తన జంతువులు ఆరోగ్యం, వేసవి తీవ్రతను తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున.. జూ పార్క్ అంతటా వేడిని ఎదుర్కోవడానికి కూలర్లు, స్ప్రింక్లర్లు, ఫాగర్‌లను ఏర్పాటు చేసింది. జూలో జంతువులు, పక్షులు, సరీసృపాలు సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జంతుప్రదర్శనశాల అంతటా 200 కంటే ఎక్కువ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి జంతువు వేడి నుండి ఉపశమనం పొందేలా చూసేందుకు ప్రతి ఎన్‌క్లోజర్‌లో చిన్న రెయిన్ గన్‌లను ఏర్పాటు చేశారు.

అదనంగా సరీసృపాల గృహం, న్యూ మకావ్స్, ఆల్ ఫిజాంట్రీ, ఏవియరీ ప్రాంతం వంటి కీలక ప్రాంతాలలో వెయ్యికి పైగా ఫాగర్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. జూ అధికారులు పచ్చిక బయళ్ళు, ఉద్యానవనాలకు నిరంతరం నీరు పోయడంతోపాటు ఆవరణలు, పరిసర ప్రాంతాలు చల్లగా, పచ్చగా ఉండేలా చూస్తున్నారు. జంతువులను వేడి నుండి మరింత తట్టుకోవడానికి 6 అంగుళాల వెడల్పు ఉన్న 1000 కిలోల తుంగ గడ్డిని రాత్రిపూట ఎన్‌క్లోజర్‌లు, వాటి పైకప్పులపై ఉంచారు. జంతువులకు వేడిని తట్టుకునేందుకు జూ అధికారులు పుచ్చకాయ వంటి సీజనల్ పండ్లను అందజేస్తున్నారు. ఇది జంతువులను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా విటమిన్లు, పోషకాల యొక్క చాలా అవసరమైన మూలాన్ని కూడా అందిస్తుంది. ఖాహార పక్షులు, జంతువుల ఎన్‌క్లోజర్‌లకు తాత్కాలిక సన్​ ప్రొటెక్షన్​ షెడ్స్​ ఏర్పాటు చేశారు. ఈ చర్యలు నెహ్రూ జూలాజికల్ పార్క్ వేసవి వేడిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Next Story