Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ముఖ్యగమనిక

మూసీ వరదలు ఎంజీబీఎస్‌ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.

By -  అంజి
Published on : 27 Sept 2025 12:00 PM IST

Hyderabad, MGBS temporarily closed, TGSRTC, passengers

Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ముఖ్యగమనిక

హైదరాబాద్‌: మూసీ వరదలు ఎంజీబీఎస్‌ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంజీబీఎస్‌ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్‌ బస్‌ స్టేషన్‌ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్‌ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాల నుంచి నడుపుతున్నట్టు సంస్థ తెలిపింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్‌ నుంచి నడుస్తాయని తెలిపింది. వరంగల్‌ హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి వెళ్తాయని తెలిపింది.

అలాగే సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి నడుస్తాయని, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్‌ నుంచి వెళ్తాయని తెలిపింది. మూసీ వరద నీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీకి విజ్ఞప్తి చేసింది. ఎంజీబీఎస్‌ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040 - 69440000, 040 - 23450033 సంప్రదించాలని సూచించింది.

Next Story