క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ నేప‌థ్యంలో అక్టోబర్ 12 శనివారం అర్ధరాత్రి వ‌ర‌కూ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయ‌ని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రకటించింది

By Medi Samrat  Published on  11 Oct 2024 7:30 PM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ నేప‌థ్యంలో అక్టోబర్ 12 శనివారం అర్ధరాత్రి వ‌ర‌కూ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయ‌ని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రకటించింది. అన్ని దిశలలోని చివరి రైలు తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరుతాయి. తెల్లవారుజామున 2 గంటలకు అది గమ్యస్థానానికి చేరుకుంటుంద‌ని పేర్కొంది.

పొడిగించిన హైదరాబాద్ మెట్రో సేవలతో పాటు.. రాచకొండ పోలీసులు భద్రతా చర్యలను అమలు చేశారు. ఎటువంటి సంఘటనలు జ‌రుగ‌కుండా ముంద‌స్తుగా మార్గదర్శకాలను జారీ చేశారు. ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహారం, రాసే పెన్నులు, పెర్ఫ్యూమ్‌లు, బైనాక్యులర్‌లు, హెల్మెట్‌లు, బ్యాటరీలు, లైటర్లు లేదా అగ్గిపెట్టెలు, పదునైన మెటాలిక్ లేదా ప్లాస్టిక్ వస్తువులు, కెమెరాలు, సిగరెట్‌లతో సహా కొన్ని వస్తువులను స్టేడియంకు తీసుకెళ్లవద్దని అభిమానులకు సూచించారు.

Next Story