హైద‌రాబాద్ మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌

Hyderabad Metro Service Timings Extended.హైద‌రాబాద్ మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2022 3:55 AM GMT
హైద‌రాబాద్ మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌

హైద‌రాబాద్ మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌. మెట్రో రైలు వేళ‌ల‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి రోజు చివ‌రి రైలు రాత్రి 10.15 గంట‌లకు స్టేష‌న్ నుంచి బ‌య‌లుదేరుతుంది. అయితే.. ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ స‌మ‌యాన్ని పొడిగించారు. రాత్రి 11 గంట‌ల‌కు చివ‌రి రైలు స్టేష‌న్ నుంచి బ‌య‌లుదేరునున్న‌ట్లు చెప్పారు. తాజా మార్పుతో ప్ర‌యాణీకుల‌కు 45 నిమిషాలు అద‌నంగా సేవ‌లు అంద‌నున్నాయి. ఈ నిర్ణ‌యం అక్టోబ‌ర్ 10(సోమ‌వారం) నుంచి అమ‌ల్లోకి రానుంది. కాగా.. ఎప్ప‌టిలాగేనే ఉద‌యం 6 గంట‌ల‌కే మెట్రో సేవ‌లు మొద‌లు కానున్నాయి.

హైద‌రాబాద్‌లో మూడు క్యారిడార్లో మెట్రో రైలు సేవలు ప్రజలకు అందబాటులో ఉన్నాయి. మియాపూర్ నుండి ఎల్బీనగర్, జేబీఎస్ నుండి ఎంజీబిఎస్, నాగోల్ నుండి రాయదుర్గం వరకు మూడు రూట్లలో 69.2 కి.మీ దూరానికి ప్రతిరోజు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్ర‌తి రోజు వెయ్యికి పైగా మెట్రో రైలు ట్రిప్పులు న‌డుస్తున్నాయి.

Next Story