డిసెంబర్ 31 : అర్ధరాత్రి రెండింటివరకు మెట్రో రైలు సర్వీసులు
Hyderabad Metro Rail to run till early hours of Sunday. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక ప్రకటన చేసింది.
By Medi Samrat Published on
30 Dec 2022 1:33 PM GMT

హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు జనవరి 1 ఆదివారం తెల్లవారుజాము వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైద్రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. చివరి రైలు ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరి 2 గంటలకు వారి గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
రైళ్లలో, స్టేషన్లలో మద్యం తాగి దుర్భాషలాడకుండా మెట్రో రైల్ పోలీసులు, సెక్యూరిటీ వింగ్‌లు నిఘా ఉంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా, అధికారులకు సహకరించాలని, బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ప్రయాణికులకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Next Story