ప్రయాణికుల కోసం.. బంపరాఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో

Hyderabad metro rail good news. పండగ వేళ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది హైదరాబాద్‌ మెట్రో. ప్రయాణికుల సౌకర్యార్థం మళ్లీ మెట్రో

By అంజి  Published on  14 Oct 2021 1:17 PM GMT
ప్రయాణికుల కోసం.. బంపరాఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో

పండగ వేళ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది హైదరాబాద్‌ మెట్రో. ప్రయాణికుల సౌకర్యార్థం మళ్లీ మెట్రో సువర్ణ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 18వ తేదీ నుండి ఈ ఆఫర్‌ మళ్లీ అమల్లోకి వస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం మెట్రో సంస్థ రాయితీలు ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ప్రయాణ ఛార్జిల్లో 40 శాతం రాయితీ కల్పించారు. భారీ వరదల వల్ల హైదరాబాద్ నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యంలోనే మెట్రోలో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు.

స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని కల్పించింది. 20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం, 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని స్మార్ట్ కారు ఉన్న వారికి హైదరాబాద్ మెట్రో కల్పించింది. దీంతో పాటు మెట్రోలో నెలకు 20 ట్రిప్పులు, ఆపైన తిరిగే వారికి లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఆ తర్వాత డ్రాలో గెలిచిన విజేతలకు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి, 30 ట్రిప్పులకు సరిపడా ట్రిప్ పాస్‌ను తీసుకోవచ్చు. అలాగే గ్రీన్‌లైన్‌ జేబీఎస్‌ పరేడ్ గ్రౌండ్‌ నుండి ఎంజీబీఎస్‌ వరకు ప్రతి ట్రిప్‌కి గరిష్టంగా రూ.15 మాత్రమే చెల్లించి ప్రయాణించవచ్చు.

Next Story