గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది. మొదటి రైలు సెప్టెంబర్ 6న ఉదయం 6:00 గంటలకు నడుస్తుంది, చివరి రైలు సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 1:00 గంటలకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.నగరం అంతటా గణేష్ నిమజ్జన ఊరేగింపులలో పాల్గొనే భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయడం అధికారులు ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం. ప్రయాణీకుల భద్రత కోసం అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు హామీ ఇచ్చారు.
వాహనాలు, విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో ప్రతి ప్రాంతంపై మ్యాప్ వేసుకుని మార్గాలను నిర్ణయించామని, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. 29 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.