Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో హోటల్‌ దగ్ధం.. వీడియో

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీలో (కేపీహెచ్‌బీ)లో అర్జున్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

By అంజి
Published on : 16 Jan 2025 2:31 AM

Hyderabad, fire accident, KPHB, Hotel burnt in fire

Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో హోటల్‌ దగ్ధం

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీలో (కేపీహెచ్‌బీ)లో అర్జున్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో హోటల్‌లో ఉన్న ఫర్నీచర్‌ మొత్తం దహనమైంది. హోటల్‌ బయట పార్క్‌ చేసి ఉంచిన రెండు బైక్‌లు కూడా దగ్ధమయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రెండు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే హోటల్‌ మొత్తం దగ్ధమైపోయింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి గల కారణాలు ఇంకా తెలియారాలేదు. అయితే షార్ట్‌ స్కర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియనున్నాయి.


Next Story