హైదరాబాద్ జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ ముఠా అక్రమ దందా గుట్టు రట్టు చేసింది. రూ.5 వేల కోట్ల విలువైన గేమింగ్ సిండికేట్‌పై దాడులు చేపట్టింది. ముంబైకి చెందిన ఏసు ప్రభుకుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని అధికారులు అరెస్టు చేశారు.
ఇద్దరు నిందితులు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని. ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తూ పెద్దమొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ సోదాలు కొనసాగిస్తుంది. జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీల వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని జీఎస్టీ విజిలెన్స్ విభాగం భావిస్తోంది.