హైదరాబాద్‌లో 'బంగారం' ఏటీఎమ్‌.. దేశంలోనే మొదటిది..

Hyderabad gets India's first Gold ATM. భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ఏటీఎమ్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది.

By అంజి  Published on  4 Dec 2022 6:35 AM GMT
హైదరాబాద్‌లో బంగారం ఏటీఎమ్‌.. దేశంలోనే మొదటిది..

భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ఏటీఎమ్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పుడు కస్టమర్లు తమ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎం నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్‌లో మొదటి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కస్టమర్లు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు.

కస్టమర్లు.. వారు డ్రా చేసుకునే బంగారం స్వచ్ఛత, బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు. గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌లో గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏటీఎం ద్వారా శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ వెల్లడించారు.

బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై డిస్ ప్లే అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. టెక్నాలజీ పరంగా దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానంలో కొనసాగుతోందన్నారు. తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చాలా యూజ్‌ఫుల్‌ అవుతుందని తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం నాణేలను డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

Next Story