Hyderabad: రికార్డ్‌ స్థాయిలో.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ

తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో గణేష్‌ లడ్డూ వేలం పాట జరిగింది.

By అంజి  Published on  17 Sept 2024 10:45 AM IST
Hyderabad, Ganesh laddu, auction, Bandlaguda Jagir

Hyderabad: రికార్డ్‌ స్థాయిలో.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో గణేష్‌ లడ్డూ వేలం పాట జరిగింది. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జరిగిన గణేష్ లడ్డూ వేలంలో రూ.1.87 కోట్లు పలికింది. గతేడాది లడ్డూ వేలం రూ.1.25 కోట్లు పలికింది.

గత ఏడాది ధరతో పోలిస్తే ఇప్పుడు రూ.62 లక్షలు పెరిగింది. కొనుగోలుదారుడి పేరును పండుగ నిర్వాహకులు విడుదల చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో గణేష్ చతుర్థి వేడుకల్లో కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ అత్యంత ఖరీదైనదిగా మారింది. 2022లో లడ్డూ రూ.60 లక్షలకు వేలం వేయబడింది.

కాగా, సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు జరగనున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలుకగా తుర్కయాంజాల్ గ్రామానికి చెందిన దాసరి దయానంద్ రెడ్డి కొనుగోలు చేశారు. గణేష్ చతుర్థికి వేలం ప్రధాన హైలైట్, ఈ సంవత్సరం వేలంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Next Story