Hyderabad: టిఫిన్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లోని ఓల్డ్ సంతోష్ నగర్ ప్రాంతంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 8 Jan 2024 6:51 AM ISTHyderabad: టిఫిన్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లోని ఓల్డ్ సంతోష్ నగర్ ప్రాంతంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే అదృష్టావశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట్లో మంటలు చెలరేగాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోని గాజులరామారం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగాయని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే జనవరి 2వ తేదీ రాత్రి సమయంలో ఉప్పల్‌లో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనలో సీఎంఆర్ షాపింగ్ మాల్ భవనం మొత్తం దగ్ధమైంది.
2023లో హైదరాబాద్ నగరంలో 1000కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో పెద్ద, చిన్న సంఘటనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ప్రాణాలు మరియు గాయాలకు దారితీసింది. ఇటీవల ఓ మండి రెస్టారెంట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ, మాదాపూర్‌లోని దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.