హైదరాబాద్: అమీర్‌పేటలోని మైత్రివన్‌లో ఉన్న శివం టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా, సమీపంలోని కోచింగ్ సెంటర్ల నుండి విద్యార్థులను ఆ ప్రాంగణం నుండి తరలించారు. బ్యాటరీలు పేలి మంటలు వ్యాపించినట్టు సమాచారం. అయితే అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు.