హనీ ట్రాప్.. దుక్కా మల్లికార్జునరెడ్డి అరెస్ట్

Hyderabad DRDL contract employee held for sharing info with suspected ISI woman handler. హనీ ట్రాప్ లో భాగంగా.. అనుమానిత ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్

By Medi Samrat
Published on : 18 Jun 2022 4:16 PM IST

హనీ ట్రాప్.. దుక్కా మల్లికార్జునరెడ్డి అరెస్ట్

హనీ ట్రాప్ లో భాగంగా.. అనుమానిత ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మహిళా హ్యాండ్లర్‌తో రహస్య సమాచారాన్ని పంచుకున్న డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ లేబొరేటరీ (DRDL) కాంట్రాక్ట్ ఉద్యోగిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీ నగర్‌ జోన్‌లోని స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌, బాలాపూర్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఆర్‌సీఐ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల దుక్కా మల్లికార్జునరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతను డిఆర్‌డిఎల్-ఆర్‌సిఐ కాంప్లెక్స్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఒక మహిళతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI మహిళకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్‌గా అనుమానిస్తున్నారు.

బీటెక్, ఎంబీఏ చేసిన నిందితుడు డీఆర్‌డీఎల్‌లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అతడిని ఫేస్‌బుక్ లో నటాషారావు అనే మహిళ సంప్రదించింది. UK డిఫెన్స్ జర్నల్‌లో ఉద్యోగి అని, UKకి మారడానికి ముందు ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారని పరిచయం చేసుకొని మోసగిస్తూ నిందితుడిని ఆమె ట్రాప్ చేసింది. సిమ్రాన్ చోప్రా, ఒమిషా అడ్డీ అనే ఇతర అకౌంట్లతో మల్లికార్జున రెడ్డి రహస్య సమాచారాన్ని పంచుకున్నాడు. అతని బ్యాంక్ ఖాతా వివరాలను కూడా చెప్పాడు. గతేడాది డిసెంబర్‌ వరకు ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్నాడు. పోలీసులు దుక్కా మల్లికార్జునరెడ్డిపై అధికారిక రహస్యాల చట్టం-1923లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రెండు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.

దుక్కా మల్లికార్జునరెడ్డి విశాఖపట్నంలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఎంబీఏ (మార్కెటింగ్) చేశారు. జనవరి 2020 వరకు DRDL నుండి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేశాడు. ప్రాజెక్ట్ తర్వాత, అతను నేరుగా DRDL అధికారులను సంప్రదించి RCI బాలాపూర్‌లో ఒక ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ ఉద్యోగి అయ్యాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్, అదనపు పోలీసు కమిషనర్ జి. సుధీర్ బాబు, ఎల్‌బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ (ఎస్‌ఓటీ) కె. మురళీధర్ ఆధ్వర్యంలో అరెస్టులు జరిగాయి.













Next Story