Hyderabad: ప్లాస్టిక్‌ సంచిలో డెడ్‌బాడీ.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌లో తీవ్ర కలకలం రేపిన ప్లాస్టిక్ సంచిలో డెడ్ బాడీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. డెడ్ బాడీని బీహార్‌కు చెందిన ముంతాజ్ ఆలమ్‌దిగా గర్తించారు.

By అంజి  Published on  27 Dec 2024 7:49 AM IST
Hyderabad, Deadbody, plastic bag, Police, Crime

Hyderabad: ప్లాస్టిక్‌ సంచిలో డెడ్‌బాడీ.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌: మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌లో తీవ్ర కలకలం రేపిన ప్లాస్టిక్ సంచిలో డెడ్ బాడీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. డెడ్ బాడీని బీహార్‌కు చెందిన ముంతాజ్ ఆలమ్‌దిగా గర్తించారు. కట్టుకున్న భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తన అక్క రవీనా బీబీ సహాయంతో భర్తను భార్య అతి కిరాతకంగా చంపినట్ట పోలీసుల విచారణలో తేలింది. డెడ్ బాడీ ఇంట్లో ఉంటే పోలీసులకు పట్టుబడుతామనుకొన్న అక్కాచెల్లెళ్లు.. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో మూట కట్టి ఆటోలో తెచ్చి దుర్గానగర్ వద్ద కల్వర్ట్‌లో పడేసి వెళ్లిపోయారు. ప్రతి రోజూ భర్త తాగి వచ్చి తనను చిత్రహింసలు పెడుతున్నాడని, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రతి క్షణం నరకం చూపిస్తున్నాడని భార్య వాపోయింది.

భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లు భార్య పోలీసులకు చెప్పింది. పథకం ప్రకారం మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి చంపేసింది భార్య. భర్తను చంపిన తరువాత అక్క సహాయంతో మృతదేహాన్ని దుర్గానగర్‌లో పడేసింది. ఈ నెల 24వ తేదీన ప్లాస్టిక్ సంచిలో గుర్తు తెలియని డెడ్ బాడీ పోలీసులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి డెడ్ బాడీని మూట కట్టి ఇక్కడ పడేసారని గుర్తించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి ముంతాజ్ ఆలమ్ గా గుర్తించారు. భర్తను హత్య చేసిన భార్య తో పాటు తనకు సహకరించిన అక్క రవీనా బీబీ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story