Hyderabad: ఏంటి మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అయితే ఒక్క క్షణం

ఏంటీ.. మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అందులో 500 రూపాయలు ఉన్నాయా.. తస్మా జాగ్రత్త.. అది నిజమైన పర్సు అనుకున్నారా అయితే పప్పులో కాలేసినట్టే

By అంజి  Published on  12 Sep 2023 4:06 AM GMT
Hyderabad, Cyberabad police,  cyber crimes

Hyderabad: ఏంటి మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అయితే ఒక్క క్షణం

ఏంటీ.. మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అందులో 500 రూపాయలు ఉన్నాయా.. తస్మా జాగ్రత్త.. అది నిజమైన పర్సు అనుకున్నారా అయితే పప్పులో కాలేసినట్టే.. హైదరాబాద్‌ నగరంలో అక్కడక్కడ పర్సులు కనిపించడంతో స్టూడెంట్స్, యువతీ యువకులు ఉత్సాహంగా ఆ పర్సులను చేతిలోకి తీసుకుని తీరా దానిని ఓపెన్‌ చూసి ఒక్క సారిగా అవాక్కవుతున్నారు. అవునండోయో ఈ వీడియోలు చూడండి మీకే అర్థమవుతుంది.

నగరంలోని పలు చోట్ల సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో వినూత్న క్యాంపెయిన్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉండడంతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ‌సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు, అప్రమత్తంగా ఉండేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 500 రూపాయల నోటు ఉన్న వాలెట్‌ను పోలిన కాగితాలను రోడ్లపై వేస్తున్నారు.

జనాలు అది పర్స్ అనుకొని తెరిచి చూస్తే సైబర్ నేరాలపై 1930 కు కాల్ చేయాలని సమాచారం ఉంటుంది. అది చూసి జనాలు ఒక్కసారిగా అవాక్కవడమే కాకుండా ముసి ముసిగా నవ్వుకుంటున్నారు.అయితే అసలుకు, నకిలీకి మధ్య తేడాను గుర్తించాలని.. ఆశపడకుండా అప్రమత్తంగా ఉండాలని సందేశం అందులో ఉందని జనం గ్రహించారు. అచ్చం మనీ పర్స్ లాగే ఉండే దానిపై 1930 నెంబర్ గురించి పోలీసులు జనాలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 కి కాల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story