హైదరాబాద్ పోలీస్‌లో ఇంటర్న్‌షిప్..ఖాకీలతో కలిసి పనిచేసే గోల్డెన్ ఛాన్స్

హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం యువత మరియు నిపుణుల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 9:08 PM IST

Hyderabad News, Hyderabad Police, Internship Opportunity, VC Sajjanar, Police Volunteer, Smart Policing

హైదరాబాద్ పోలీస్‌లో ఇంటర్న్‌షిప్..ఖాకీలతో కలిసి పనిచేసే గోల్డెన్ ఛాన్స్

హైదరాబాద్: సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం మరియు విజ్ఞాన ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక వినూత్న ముందడుగు వేసింది. యువత మరియు నిపుణుల నైపుణ్యాలను పోలీస్ విభాగం యొక్క సంస్థాగత సామర్థ్యం పెంచేందుకు వినియోగించుకునేలా 'ఇంటర్న్‌షిప్' మరియు 'వాలంటీర్ ఎంగేజ్‌మెంట్' ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది.

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలు: ఆధునిక పోలీసింగ్ విధానాల్లో యువతలోని సృజనాత్మకతను మరియు విద్యాపరమైన నైపుణ్యాన్ని భాగస్వామ్యం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

అర్హత: 25 ఏళ్ల లోపు వయస్సు కలిగి, ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

విధులు: ఎంపికైన ఇంటర్న్‌లకు పోలీస్ శాఖ ప్రాధాన్యతలకు అనుగుణంగా డేటా అనాలిసిస్, పరిశోధన ఆధారిత ప్రాజెక్టులు మరియు నిర్దిష్ట విధులను కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలన మరియు పోలీసింగ్ వ్యవస్థపై ఆచరణాత్మక అవగాహన లభిస్తుంది.

ప్రశంసా పత్రం: ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ అందజేస్తారు.

ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్: వివిధ రంగాల్లో అనుభవం ఉన్న నిపుణులు సైతం తమ వంతు సహకారాన్ని అందించేలా వాలంటీర్ అవకాశాలను కల్పించారు. సాంకేతిక లేదా ప్రక్రియ ఆధారిత పనుల్లో (Process-oriented assignments) నిపుణులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి పోలీస్ విభాగపు అభివృద్ధికి మరియు నూతన ఆవిష్కరణలకు తోడ్పడవచ్చు.

నిర్వహణ: ఈ కార్యక్రమాలన్నింటినీ పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో SMIT సెల్ (SMIT Cell) నోడల్ యూనిట్‌గా వ్యవహరిస్తూ సమన్వయం చేస్తుంది.

దరఖాస్తు విధానం: అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ http://hyderabadpolice.gov.in ను సందర్శించగలరు.

Next Story