Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కారు బీభత్సం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్స్ రాంప్ పై ఒక కారు బీభత్సం సృష్టించింది. కారు మితిమీరిన వేగంతో వచ్చి పార్కింగ్ చేసిన కార్ల పైకి దూసుకెళ్లింది.

By అంజి  Published on  16 Jan 2025 7:44 AM IST
Hyderabad, Car accident, Shamshabad Airport

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కారు బీభత్సం 

హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్స్ రాంప్ పై ఒక కారు బీభత్సం సృష్టించింది. కారు మితిమీరిన వేగంతో వచ్చి పార్కింగ్ చేసిన కార్ల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణీకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఐదు కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. కారు డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించి వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సిబ్బంది క్రేన్ సహాయంతో ధ్వంసమైన కార్లను తొలగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story