Hyderabad: అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్‌

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీనివాస్‌, మోహన్‌, నాగరాజు, నరేశ్‌, ప్రేమ్‌ కుమార్‌, ప్రకాశ్‌లు నిన్న ఇంటిపై దాడి చేయగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి  Published on  23 Dec 2024 4:30 AM GMT
Hyderabad, Attack, Allu Arjun, house, Bail, accused

Hyderabad: అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్‌

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీనివాస్‌, మోహన్‌, నాగరాజు, నరేశ్‌, ప్రేమ్‌ కుమార్‌, ప్రకాశ్‌లు నిన్న ఇంటిపై దాడి చేయగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ఆరుగురిని ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీసులు వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరుచగా బెయిల్‌ మంజూరు చేశారు. కాగా నిన్న నగరంలోని అల్లు అర్జున్‌ ఇంటని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరేశారు.

గేటు లోపలికి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. అటు అల్లు అర్జున్‌ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు.

Next Story