Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్‌

ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.

By -  అంజి
Published on : 9 Dec 2025 9:05 AM IST

Hyderabad, bomb threat mail , Shamshabad Airport, RGIA

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్‌

హైదరాబాద్‌: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందని, పేలుడు జరగకుండా ఉండాలంటే మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్‌ అమెరికాకు చెందిన జాస్పర్‌ పంపినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) కు వివిధ నగరాల నుండి వస్తున్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని, వాటిలో రెండు అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయని భద్రతా తనిఖీల తర్వాత ఈ బెదిరింపును బూటకమని పోలీసులు సోమవారం (డిసెంబర్ 8, 2025) తెలిపారు.

ఆదివారం రాత్రి విమానాశ్రయానికి హీత్రూ నుండి బ్రిటిష్ ఎయిర్‌వేస్ (BA 277), ఫ్రాంక్‌ఫర్ట్ నుండి లుఫ్తాన్సా (LH 752) మరియు కన్నూర్ నుండి ఇండిగో 6E 7178 విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇమెయిల్‌లు వచ్చాయి. అన్ని విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

Next Story