రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 2 వరకు నగరం నుండి విమానాశ్రయానికి తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రయాణికులకు సూచించింది. "భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించిన కారణంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 2 వరకు ప్రయాణీకులు నగరం నుండి విమానాశ్రయానికి తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని విమానాశ్రయ అధికారులు అభ్యర్థించారు.
భారత్ జోడో యాత్ర కు నవంబర్ 4 న ఒక రోజు విరామం ఉండగా.. నవంబర్ 7 వరకు రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 375 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర కొనసాగునుంది. ప్రతిరోజూ 20-25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలావుంటే.. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది. యాత్ర తెలంగాణలో ప్రవేశించడానికి మొదలే టీపీసీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మక్తల్‌లో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు.