Hyderabad: నార్సింగిలో తల్లి, కూతురి సూసైడ్.. అపార్ట్‌మెంట్‌ 18వ అంతస్తు నుంచి దూకడంతో..

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో ఆదివారం సాయంత్రం అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

By అంజి  Published on  30 Sept 2024 9:33 AM IST
Hyderabad, woman, daughter, Narsingi, Crime

Hyderabad: నార్సింగిలో తల్లి, కూతురి సూసైడ్.. అపార్ట్‌మెంట్‌ 18వ అంతస్తు నుంచి దూకడంతో..

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో ఆదివారం సాయంత్రం అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళన చెందారు. మృతురాలిని భీమవరానికి చెందిన మానస (30)గా గుర్తించారు. ఆమె భర్త, కుమార్తెతో కలిసి మైహోమ్‌ అవతార్‌ అపార్ట్‌మెంట్‌ 18వ అంతస్తులో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌ వాసులు, సెక్యూరిటీ సిబ్బందికి భవనం పై అంతస్తుల నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఘటనా స్థలానికి చేరుకుని చూడగా రక్తపు మడుగులో ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించాయి.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను ఓజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆదివారం రాత్రి మానస తన మూడేళ్ల కుమార్తె కృషితో కలిసి దూకినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తల్లి కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మానస వెన్నునొప్పితో బాధపడుతోందని, అదే ఈ ఘటనకు దారి తీసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story