Hyderabad: ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
హైదరాబాద్ నగర పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు విషాదాలను నింపుతున్నాయి. తాజాగా కుషాయిగూడలో మరో ఘోర అగ్ని ప్రమాదం
By అంజి Published on 16 April 2023 7:29 AM IST
Hyderabad: ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
హైదరాబాద్ నగర పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు విషాదాలను నింపుతున్నాయి. తాజాగా కుషాయిగూడలో మరో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. దాని మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న తల్లి, తండ్రి, చిన్నారి మృతి చెందారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం సిబ్బంది గాలిస్తున్నారు. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.. ముగ్గురి మృతదేహాలను వెలికితీసింది. మృతదేహాలను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన నరేశ్ (35), సుమ(28), జోషిత్(5)గా గుర్తించారు.
మరోవైపు అటు బహదూర్‌పురాలోని లారీ వర్క్‌షాప్ గోదాంలో కూడా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు 2021లో 6,675 కాగా, 2022లో 7,368 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనలో గతేడాది 2021లో 25 మంది మరణించగా, అగ్నిమాపక సిబ్బంది 2021లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, గతేడాది 213 మంది ప్రాణాలు కాపాడారు. చాలా అగ్ని ప్రమాదాలు సిగరెట్లను అజాగ్రత్తగా పారవేయడం వలన సంభవించాయి. తరువాత షార్ట్ సర్క్యూట్లు, తప్పుడు విద్యుత్ కేబుల్స్, గ్యాస్ బొగ్గు కొలిమి, చిమ్నీల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి.