సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ సమీపంలోని బాబీ లాడ్జి దగ్గర ఉన్న ఓ దుకాణంలో అగ్ని

By అంజి  Published on  9 July 2023 8:17 AM IST
fire accident , Secunderabad railway station, hyderabad

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ సమీపంలోని బాబీ లాడ్జి దగ్గర ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాపు నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పాళీక బజార్ ధమాకా సెల్ బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఈ నెల 2వ తేదీన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెజిమెంటల్‌ బజార్‌లోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సిబ్బంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న వంట సామాగ్రిపై నూనె పడి ఉండటంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Next Story