సీనియర్ తెలుగు ఐపీఎస్‌ అధికారికి వినికిడి లోపం కలగడానికి కారణమైన సింగ‌ర్‌

How singer Daler Mehndi caused hearing loss to senior IPS officer. 2003లో మానవ అక్రమ రవాణా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన ప్రముఖ

By Medi Samrat  Published on  16 July 2022 3:09 PM GMT
సీనియర్ తెలుగు ఐపీఎస్‌ అధికారికి వినికిడి లోపం కలగడానికి కారణమైన సింగ‌ర్‌

2003లో మానవ అక్రమ రవాణా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీకి హైదరాబాద్‌తో సంబంధం ఉంది. అతని బృందం ఒక సీనియర్ IPS అధికారికి వినికిడి లోపం కలగడానికి కారణమైంది. వింతగా అనిపించినా ఇది నిజం. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఏడీసీ (ఎయిడ్స్-డి-క్యాంప్) గవర్నర్ ఎం శివ ప్రసాద్‌ వెల్లడించారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, పెద్ద శబ్దం కారణంగా వినికిడి లోపం కలిగిస్తుంది.

2003 మానవ అక్రమ రవాణా కేసులో 2018లో శిక్ష పడిన పంజాబీ పాప్ గాయకుడు దలేర్ మెహందీకి పంజాబ్‌లోని పాటియాలా జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్షను సమర్థించిన వార్తను విన్న శివ ప్రసాద్ గతంలోకి వెళ్లి విషాద సంఘటనను గుర్తు చేసుకున్నారు. "నేను కూడా ఒక విధంగా దలేర్ మెహందీ బాధితుడినే. అయితే, మానవ అక్రమ రవాణా విషయంలో కాదు. నేను ఇద్దరు గవర్నర్‌లకు ఏడీసీగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా ఉన్న సమయంలో, దలేర్ మెహందీ హైదరాబాద్‌కు వచ్చి సంగీత కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కోలాహలం మధ్య గవర్నర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దలేర్ సంగీతం అంటే ఆయనకు చాలా ఇష్టం" అని శివప్రసాద్‌ న్యూస్‌మీటర్‌తో అన్నారు.

"విధి నిర్వహణలో భాగంగా, నేను గవర్నర్ వెనుక నిలబడి ఉన్నాను. ఫుల్ డ్రమ్స్ సౌండ్స్ నా కుడి చెవికి వినిపిస్తూనే ఉన్నాయి. నా కుడి చెవిలో అసాధారణమైన ఇబ్బంది కలిగింది. కానీ నేను దానిని గుర్తించలేకపోయాను. రోజు, మరుసటి రోజు ఫోన్ కాల్స్ సరిగా వినిపించకపోవడంతో.. ఫోన్ సరిగా లేదని అనుకున్నాను. 24 గంటల తర్వాత నా కుడి చెవిలో ఏదో సమస్య ఉందని గ్రహించగలిగాను" అని ఆయన గుర్తు చేసుకున్నారు. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, అడ్మినిస్ట్రేషన్, జాయింట్ సీపీ, సీఏఆర్‌తో సహా పలు పదవులను నిర్వహించిన ఈ ఐపీఎస్ అధికారి ఈఎన్‌టీ వైద్యుడి వద్దకు చేరుకున్నారు. "నేను ఎడమ చెవి నుండి మాత్రమే ఎందుకు వినాలనుకుంటున్నానో అని స్నేహితులు, సహోద్యోగులు నన్ను అడిగారు. కొంతమంది శ్రేయోభిలాషులు దానిని నా యాటిట్యూడ్ అనే అన్నారు. నేను ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచగలిగినందుకు.. నా ఎడమ చెవికి కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు. శివ ప్రసాద్ రహస్యాన్ని గురించి తెలిసిన మరొక వ్యక్తి అతని భార్య ఉష మాత్రమే. "ఆమె ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇక దలేర్ మెహందీకి ఈ విషయాన్ని అతనికి చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ అది చేయలేకపోయాను," అన్నారాయన.

బెయిల్‌పై ఉన్న దలేర్ మెహందీని 2003లో మానవ అక్రమ రవాణా కేసులో పాటియాలా జిల్లా కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2018లో కోర్టు రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. తాజాగా అతని అప్పీల్‌ను తిరస్కరించారు.














Next Story