హైదరాబాద్‌లో హిజ్రాల హల్‌చల్.. ఇంటి యజమానితో అసభ్యంగా ప్రవర్తించి
Hijras Make Hulchul In Hyderabad. హైదరాబాద్ నగరశివారులోని బాచుపల్లిలో హిజ్రాలు హల్‌చల్ చేశారు.
By Medi Samrat Published on
27 Dec 2020 5:16 AM GMT

హైదరాబాద్ నగరశివారులోని బాచుపల్లిలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. వ్రతం జరుగుతున్న ఇంట్లోకి మూకుమ్మడిగా ప్రవేశించి రూ.20వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించడంతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. బాచుపల్లిలోని ప్రగతి నగర్‌లోని ఓ ఇంట్లో నూతన దంపతులతో కుటుంబ సభ్యులు వ్రతం చేయిస్తున్నారు. విషయం తెలిసి ఇంట్లోకి ప్రవేశించిన పది మంది హిజ్రాలు తమకు రూ.20వేలు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించడంతో.. అక్కడే అర్థనగ్న ప్రదర్శన చేశారు. చివరకు ఇంటి యజమాని నుంచి రూ.16,500 బలవంతంగా వసూలు చేసి వెళ్లిపోయారు.
అనంతరం ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ. 16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Next Story