జూబ్లీహిల్స్ పబ్ లకు షాకిచ్చిన హైకోర్టు

High Court Restriction Jubilee Hills Pubs. హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని

By Medi Samrat  Published on  30 Dec 2022 8:15 PM IST
జూబ్లీహిల్స్ పబ్ లకు షాకిచ్చిన హైకోర్టు

హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని ఆదేశించింది. న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పబ్ లను పూర్తిగా కాలనీ నుంచి తొలగించాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పబ్ ల కారణంగా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్ద పెద్ద శబ్దాలతో పబ్ నిర్వాహకులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని, రాత్రి వేళ కూడా హంగామా చేస్తున్నారని.. హైకోర్టు ఆదేశాలతో తమ బాధలు కొంచెం అయినా తీరినట్లేనని చెప్పుకొచ్చారు. పబ్ లపై హైకోర్టు తీర్పును కాలనీవాసులు స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ కు అనుమతి ఇచ్చారు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంపై పలువురు రాజకీయనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ పాలనను గాలికి వదిలేశారని కాంగ్రెస్ నాయకురాలు సునీత రావు మండిపడ్డారు. డిసెంబర్ 31st రాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరచి ప్రజలను లూటీ చేయాలని చూస్తుందన్నారు. హైకోర్టు రాత్రి 10గంటలకు మద్యం షాపులు మూసేయాలని చెప్పినా చీఫ్ సెక్రటరీ కొత్త జీవో విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు.


Next Story