హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎమర్జెనీ అయితే ఈ నంబర్లకు కాల్‌ చేయండి: GHMC

హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.

By అంజి  Published on  16 May 2024 11:51 AM GMT
Heavy Rains, Hyderabad, Ghmc, IMD

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎమర్జెనీ అయితే ఈ నంబర్లకు కాల్‌ చేయండి: GHMC

హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజల కోసం జీహెచ్‌ఎంసీ టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సహాయం కోసం 040 - 21111111 లేదా 9000113667కు ఫోన్‌ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ అప్రమత్తం చేశారు.

అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. లోత‌ట్టు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు నిల్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, నేల‌కొరిగిన వృక్షాల‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు. మ్యాన్‌హోల్స్‌ దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు గంట భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరవాసులు అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Next Story