హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. స్తంభించిన జ‌న‌జీవ‌నం

Heavy Rain in Hyderabad Today.హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ ఉద‌యం(గురువారం) నుంచి ఎడ‌తెరిపి లేకుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2022 4:32 PM IST
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. స్తంభించిన జ‌న‌జీవ‌నం

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ ఉద‌యం(గురువారం) నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న వ‌ర్షంతో జ‌న‌జీవ‌నం స్తంభించింది. పంజాగుట్ట‌, కాచిగూడ‌, అంబ‌ర్ పేట‌, న‌ల్ల‌కుంట‌, చందాన‌గ‌ర్‌, మ‌ల్కాజ్‌గిరి, కీస‌రలో భారీ వ‌ర్షం కురిసింది. చిక్క‌డ‌ప‌ల్లి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, కాటేదాన్‌, బోయిన్ ప‌ల్లి, మారేడుప‌ల్లి, క‌వాడిగూడ‌, రాంన‌గ‌ర్‌లో ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసింది. గాంధీన‌గ‌ర్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, శివ‌రాంప‌ల్లి, శంషాబాద్‌, మ‌ణికొండ, బేగంపేట ల‌లో కురిసిన వ‌ర్షానికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఉద‌యం నుంచి కురుస్తోన్న వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా జ‌ల‌యమం అయ్యాయి. చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. దీంతో కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.


మూడు రోజుల పాటు వ‌ర్షాలు..

ఇదిలా ఉంటే.. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Next Story