హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం
Heavy rain in Hyderabad. హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి
By Medi Samrat Published on 31 July 2023 12:15 PM GMTహైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, ఆశోక్ నగర్, మియాపూర్, బాలానగర్, నేరేడ్ మెట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలోని రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడ వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. నగరంలో భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ అయ్యారు.
గత సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 01 మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.