హైదరాబాద్‌లో HCLTech అంతర్జాతీయ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు HCLTech వారి కొత్త అంతర్జాతీయ డెలివరీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Feb 2025 2:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు HCLTech వారి కొత్త అంతర్జాతీయ డెలివరీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు, సి విజయ కుమార్, CEO & మేనేజింగ్ డైరెక్టర్ HCLTech కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “భారతదేశంలో తెలంగాణ మరియు హైదరాబాద్ లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మరియు నగరాలు. గత ఏడాదిగా, మేము అత్యధికంగా పెట్టుబడులు స్వీకరించాము మరియు ఈ రోజు దేశంలో AIని అధికంగా అనుసరిస్తున్న వారిలో భాగంగా ఉన్నాము. తెలంగాణ రైజింగ్ కార్యక్రమం కింద తెలంగాణను ట్రిలియన్-డాలర్ ఆర్థిక వ్యవస్థగా చేయడానికి మేము కట్టుబడ్డాము. ఒక అంతర్జాతీయ కంపెనీగా, HCLTech భారతదేశం గర్వించేలా చేసింది. ఈరోజు ఈ కొత్త ప్రపంచ స్థాయికి చెందిన ఫెసిలిటీతో, HCLTech తెలంగాణా నుండి గొప్ప విషయాలను సృష్టిస్తుంది.”
శ్రీధర్ బాబు మాట్లాడుతూ “ఆవిష్కరణ, నైపుణ్యవంతమైన సిబ్బంది, శక్తివంతమైన వ్యాపార హితమైన వాతావరణంతో ప్రోత్సహించబడి తెలంగాణ ట్రిలియన్ –డాలర్ ఆర్థిక వ్యవస్థగా వేగంగా పరివర్తనం చెందుతోంది. గత దశాబ్దంగా, మన రాష్ట్రం భారతదేశంలో అత్యంత వేగంగా అబివృద్ధి చెందుతున్న కేంద్రాలలో ఒకటిగా ఉంది, AI, క్లౌడ్ మరియు డిజిటల్ పరివర్తనలో అంతర్జాతీయ నాయకులను ఆకర్షిస్తోంది. ఈ అభివృద్ధిని పెంచడానికి, మౌళిక సదుపాయాలను, నైపుణ్యాన్ని మరియు ఆవిష్కరణను శక్తివంతం చేయడానికి తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా $15 బిలియన్ లను మేము పెట్టుబడి పెడుతున్నాము. అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్ ప్రముఖ ఎంపికగా నిలిచింది. ఇక్కడ అంతర్జాతీయ డెలివరీ ఫుట్ ప్రింట్ ను విస్తరించాలని HCLTech వారి నిర్ణయం ప్రముఖ టెక్ గమ్యస్థానంగా మా స్థానాన్ని మరింత శక్తివంతం చేసింది. ఈ కొత్త కేంద్రం తెలంగాణ నుండి ప్రపంచానికి ఆధునిక పురోగతులను ప్రోత్సహిస్తుంది.”
ఈ సందర్భంగా, సి విజయకుమార్, CEO &మేనేజింగ్ డైరెక్టర్, HCLTech మాట్లాడుతూ, “AI ద్వారా జరిగిన టెక్నాలజీ అభివృద్ధి యొక్క ఉత్సాహవంతమైన దశలో మనం ఉన్నాము. HCLTech వారి సమగ్రమైన పోర్ట్ ఫోలియో మరియు మా సిబ్బంది ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల శక్తిని వినియోగించడంలో ఎంటర్ ప్రైజెస్ కు సహాయపడుతున్నారు. మా క్లైంట్లకు ఈ పరిష్కారాలను అందచేయడానికి మరియు నగరంలో గ్లోబల్ కేపబిలిటి సెంటర్స్ ను అభివృద్ధిని మద్దతు చేయడానికి మా అంతర్జాతీయ నెట్ వర్క్ లో హైదరాబాద్ వ్యూహాత్మకమైన ప్రదేశంగా నిలిచింది.”
ఆధునికమైన ఈ డెలివరీ సెంటర్ హైదరాబాద్ లో HCLTech వారి అయిదవ కేంద్రం. హై-టెక్ సిటీలో ఉన్న, ఈ 320,000 చదరపు అడుగుల కేంద్రం 5,000 మంది ఉద్యోగులు కూర్చుని పని చేయగల స్థలాన్ని కలిగి ఉంది మరియు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ ను పొందింది, ఇది సుస్థిరమైన వ్యాపార పద్ధతులకు HCLTech వారి అంకిత భావాన్ని సూచిస్తోంది.
HCLTech 2007 నుండి హైదరాబాద్ లో ఉంది మరియు నగరంలో 10,000 మందికి పైగా ఉద్యోగులు దీనిలో పని చేస్తున్నారు.