బండి సంజయ్‌కు పోలీసుల నోటీసులు
Hayathnagar police issued notices to Bandi Sanjay.ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా నాటకం
By తోట వంశీ కుమార్ Published on
14 Jun 2022 9:38 AM GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా నాటకం ప్రదర్శించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే విషయంలో నాలుగు రోజుల క్రితం జిట్టా బాలకృష్ణను అరెస్ట్ చేయగా ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలో 'అమరుల యాదిలోస సభను నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఓ నాటకం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Next Story