హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ రీల్స్ కాంటెస్ట్ పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ. లక్ష నగదు ఇవ్వనున్నట్లు తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ప్రకటించింది. హైదరాబాద్ అభివృద్ధిపై యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో తమ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఈ నాలుగు వేదికల్లో.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌ను @DigitalMediaTS కు ట్యాగ్ చేయాలి. తమ వీడియోలను dir_dm@telangana.gov.in కు మెయిల్ చేయొచ్చు. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇతర వివరాల కోసం https://it.telangana.gov.in/contest/ ను సంప్రదించొచ్చు. వీడియోస్‌ను పోస్టు చేసేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీగా నిర్ణయించారు.